PM కిసాన్ అమౌంట్ రెట్టింపు చేయాలి – రాహుల్ గాంధీ

పీఎం కిసాన్ సమ్మాన్ యోజన పథకం కింద ఐదు ఎకరాల లోపు పాల్గొన్న అందరికీ ప్రభుత్వం ఏటా ఆరు వేల రూపాయలు అకౌంట్లో వేస్తోంది. ఈ పథకాన్ని 2018 డిసెంబర్ లో స్టార్ట్ చేసి రిజిస్ట్రేషన్ ప్రక్రియను 2019 ఫిబ్రవరి అయితే ముగించారు.

ఈ పథకం ద్వారా ఒక్క విడతగా కేంద్ర ప్రభుత్వం రైతుల అకౌంట్ లో 2000 రూపాయలు జమ చేస్తూ వస్తోంది. అంటే మూడు విడతలుగా ఒక సంవత్సరానికి గాను గరిష్టంగా ఆరు వేల రూపాయలను రైతులు పొందవచ్చు.

మరి ఈ మధ్య జరిగినటువంటి సెంట్రల్ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఈ సదస్సులో రాహుల్ గాంధీ గారు ఈ పి ఎం కిసాన్ సమ్మాన్ నిధి అమౌంట్ ని రెండు వేల రూపాయల నుండి నాలుగు వేలకు పెంచాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇలా చేయడం ద్వారా సన్నకారు రైతులకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది అని విజ్ఞప్తి చేశారు.

ఇలా జరిగితే మాత్రం పీఎం కిసాన్ పదో విడతగా రైతుల అకౌంట్ లో పడే అమౌంట్ రెండు వేల రూపాయల నుండి 4000 గా కానుంది.

Leave a Comment