రుణాలను సద్వినియోగం చేసుకోవాలి

*డీసీసీబీ వైస్ చైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డి
*మహిళా సంఘాలకు 60లక్షల రూపాయల రుణాలు పంపిణీ

పాలకుర్తి : dccb ద్వారా అందిస్తున్న రుణాలను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని ఉమ్మడి జిల్లా డిసిసిబి వైస్ చైర్మన్ కుందూరు వెంకటేశ్వర్ రెడ్డి అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని డిసిసిబి బ్రాంచ్ లో మహిళా పొదుపు సంఘాలకు 60 లక్షల రుణాలు చెక్కులను అందజేశారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వెంకటేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ dccb ద్వారా అన్ని వర్గాల వారికి రుణాలు అందజేయడం జరుగుతుందని అన్నారు. వ్యవసాయ రుణాలతో పాటు అనుబంధ రంగాలు, చిన్న వ్యాపారులకు అతి తక్కువ వడ్డీతో రుణాలు అందిస్తున్నామన్నారు.

Leave a Comment