రుణమాఫీ జరగాలంటే ఇవి తప్పనిసరి

తెలంగాణ వ్యాప్తంగా ఉన్న రైతులకి గుడ్ న్యూస్. తెలంగాణ ముఖ్యమంత్రి అయిన కెసిఆర్ గారు రైతు రుణమాఫీ కింద లక్ష రూపాయల లోన్ మాఫీ చేస్తామని హామీ ఇచ్చారు.

తెలంగాణలో ఉన్న రైతులు ఎవరైతే 2014 ఏప్రిల్ నుండి 2019 డిసెంబర్ లోపల వ్యవసాయ రుణాలు తీసుకున్నారో వాళ్లందరికీ కచ్చితంగా రుణమాఫీ జరుగుతుంది. అయితే కచ్చితంగా రైతులు రుణమాఫీ కింద దరఖాస్తు చేసుకుని ఉండాలి.

ఇందుకుగాను కొన్ని ముఖ్యమైన అర్హతలు ఉండాల్సి ఉంది. వాటి గురించి ఇప్పుడు ఒక్కొక్కటిగా తెలుసుకుందాం.

  1. రైతులందరూ వారి బ్యాంక్ ఖాతాలతో ఆధార్ కార్డు నెంబర్ ను తప్పనిసరిగా అనుసంధానం చేసుకుని ఉండాలి.
  2. ఒక్కో కుటుంబంలో ఎంతమంది రుణం తీసుకున్న కూడా ఒకరికి మాత్రమే లక్ష వరకు రైతు రుణమాఫీ జరుగుతుంది.
  3. అలాగే పట్టణాలు మరియు సిటీలో ఉన్న వాళ్ళకి వర్తించదు, కేవలం గ్రామీణ ప్రాంత రైతులకు మాత్రమే ఈ రుణమాఫీ వర్తిస్తుంది.

వీటితో పాటు ఇప్పటికైతే 50,000 లోపల మనం తీసుకున్న వాళ్లకి మొదటి విడతగా 25 వేల వరకు మాఫీ చేయడం జరిగింది. వచ్చే మార్చి బడ్జెట్ లో రెండో విడత గా చాలా మంది రైతులకు రుణమాఫీ జరగనుంది.

Leave a Comment