మహిళలకు ఉచిత టైలరింగ్ శిక్షణ

డిచ్పల్లి : ఎస్బిఐ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ( RSETI), డిచ్పల్లి ఆధ్వర్యంలో ఉచిత టైలరింగ్ శిక్షణ కోసం మహిళల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సంస్థ డైరెక్టర్ సుధీంద్ర బాబు ఉ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం నుంచి శిక్షణ తరగతులు ప్రారంభమవుతాయి అన్నారు. ఇందులో ఉచిత శిక్షణతో పాటు ఉచిత భోజనం మరియు హాస్టల్ వసతి కల్పిస్తారని తెలిపారు.టైలరింగ్ పనిముట్లు అంటే కుట్టుమిషన్లు మరియు యూనిఫామ్ అందిస్తామన్నారు.

కోవిద్ నిబంధనలు పాటిస్తూనే టైలరింగ్ శిక్షణ, సమయపాలన, బిజినెస్ డెవలప్మెంట్, కమ్యూనికేషన్ స్కిల్స్ వంటి పలు అంశాల్లో మెళుకువలను నేర్పిస్తారు అని చెప్పారు. అలాగే శిక్షణ పూర్తయిన అనంతరం ధ్రువీకరణ పత్రం అందజేస్తారు. నిజామాబాద్ మరియు కామారెడ్డి జిల్లాలకు చెందిన 19 నుంచి 45 వయసు గల అభ్యర్థులు ఈ శిక్షణకు దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. ఆధార్ కార్డు, రేషన్ కార్డు, పదోతరగతి ధ్రువీకరణ పత్రం, ఐదు పాస్పోర్ట్ ఫోటోలు తీసుకొని ఆర్ ఎస్ ఈ టి ఐ డిచ్పల్లి లో తమ పేరును రిజిస్ట్రేషన్ చేసుకోవాలని తెలిపారు.

Leave a Comment