గ్యాస్ ధరలపై కేంద్రం కొత్త పంథా !

న్యూఢిల్లీ : ఎల్పిజి సిలిండర్ లపై అందిస్తున్న సబ్సిడీలో మార్పులతో కొత్త పథకాలు తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తోందని సమాచారం. రెండు ప్రతిపాదనలపై కేంద్రం చర్చలు జరుపుతోందని ఓ జాతీయ మీడియా రిపోర్టర్ పేర్కొంది. ఎలాంటి సబ్సిడీ లేకుండా ఏ ఖాతాదారుడు కైనా సిలిండర్ విక్రయించడం మొదటి ఆప్షన్ గా ఉంది. కాగా ఎంపిక చేసిన కస్టమర్లకు మాత్రమే సిలిండర్లపై సబ్సిడీని అందించాలని, ఇది రెండవ ప్రతిపాదనగా ఉందన్నది రిపోర్ట్ సమాచారం.

ఈ ప్రతిపాదనలపై ప్రభుత్వం అంతర్గతంగా చర్చలు దొరుకుతుందనే సమాచారం. ఈ అంశంపై ప్రభుత్వం నుంచి అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు. అయితే సబ్సిడీలపై మాత్రం ప్రభుత్వం పరిమితి విధించే అవకాశం ఉందని రిపోర్ట్ పేర్కొంది. కథ కొన్ని నెలలుగా ఎల్పిజి పై సబ్సిడీలను ప్రభుత్వం నిలిపివేసింది. అంతర్జాతీయంగా పెరిగిన చమురు ధరలు దీనికి కారణంగా తెలుస్తోంది. మరి సబ్సిడీ తీసేసి తక్కువ ధరకే సిలిండర్ గ్యాస్ ను విక్రయించే విధంగ చర్యలు తీసుకోవాలని అందరూ డిమాండ్ చేస్తున్నారు.

Leave a Comment